April 8, 2024
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ కి సంబంధించిన రేప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లు అర్జున్ తో కలిసి నిహారిక దిగిన ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ.. హ్యాపీయేస్ట్ బర్తడే బన్నీ అన్న అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసినటువంటి అల్లు అర్జున్ అభిమానులు షాక్ అవుతున్నారు.
నిహారికకు అల్లు అర్జున్ వరసకు బావ అవుతారు. కానీ ఈమె మాత్రం అన్నా అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఒకసారిగా షాక్ అయ్యారు బావని పట్టుకొని అన్న అనడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నిహారిక ఇలా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో అందుకు సంబంధించిన స్టోరీని అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసారు.
ఇలా తనుకు నీహారిక శుభాకాంక్షలు చెప్పడంతో ఈయన మాత్రం థాంక్యూ డార్లింగ్ అంటూ రిప్లై ఇస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక అల్లుఅర్జున్ పుట్టినరోజు కావడంతో పుష్ప 2 సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.
Read More: రహస్యంగా నిశ్చితార్థం.. వారికి మాత్రమే రహస్యం అంటున్న సిద్ధార్థ్!