ఆగస్టులో చిరంజీవి విదేశీ ప్రయాణం

July 1, 2022

ఆగస్టులో చిరంజీవి విదేశీ ప్రయాణం

ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో నిలిచిన భారీ చిత్రాల్లో ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) ఒకటి చిరంజీవి(Chiranjeevi) హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రంలో రవితేజ (Ravi Teja) ఓ కీలక పాత్రధారి కాగా, శ్రుతీహాసన్‌ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది కాబట్టి సినిమా షూటింగ్‌ను వీలైనంత తొందరగా రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఇందుకోసం ఓ షెడ్యూల్‌ను రెడీ చేసుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఈ నెల రెండో వారంలో జరుగుతుంది. ఆగస్టులో చిత్రయూనిట్‌ మలేషియా వెళ్తుంది. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత మల్తా, గోవా లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుపుతారు. ఈ గోవా షెడ్యూల్‌ సెప్టెంబరులో ఉంటుంది.

Chiranjeevi going to abroad in August

ఈ సినిమా వైజాగ్‌ నేపథ్యంలో సాగుతుంది. ఓ సీనియర్‌ అండర్‌కవర్‌ పోలీసాఫీసర్‌గా చిరంజీవి నటిస్తారు. ఈ చిత్రంలో రవితేజది చిరంజీవికి తమ్ముడి పాత్ర. తమ్ముడి చావుకి కారణమైన వారిని పట్టుకునే అన్నయ్యగా చిరంజీవి కనిపిస్తారు. మేజారిటీ షూటింగ్‌ సముద్రతీర ప్రాంతంలోనే జరుగుతుంది. తమిళ నటుడు బాబీ సింహా(Bobby Sinha) ఓ విలన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్‌కి చెందిన ఓ యాక్టర్‌ మెయిన్‌ విలన్‌. ఈ సినిమా కాకుండా ‘భోళాశంకర్‌’(Bholaa Shankar), ‘గాడ్‌ఫాదర్‌’(God Father) చిత్రాల్లో నటిస్తున్నారు చిరంజీవి. ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి రానుంది.

Chiranjeevi going to abroad in AugustRead More: ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కొత్త ఫోటోలు

ట్రెండింగ్ వార్తలు