August 24, 2022
ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రాలు ‘భోళాశంకర్’, ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల అప్డేట్స్ వచ్చాయి. కానీ చిరంజీవి హీరోగా ‘ఛలో’, ‘భీష్మ’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ ఫిల్మ్స్ తీసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమాను ప్రకటిం చారు. అయితే చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను గురించి ఏ అప్డేట్ లేదు. అంతేకాదు..బర్త్ డే విషెస్ పోస్టర్ కూడా రాలేదు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ప్రజెంట్ చిరంజీవితో సినిమాలు చేస్తున్న దర్శకులు వచ్చారు. కానీ వెంకీ కుడుముల కనిపించలేదు. దీంతో చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్లోని సినిమా క్యాన్సిల్ అయినట్లుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన వస్తే కానీ ఇండస్ట్రీ గాపిస్ రాయుళ్ల నోళ్ళు మూతలు పడవు.
ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ ఈ అక్టోబరు 5న, ‘వాల్తేరు వీరయ్య’ వచ్చే సంక్రాంతికి, ‘భోళా శంకర్’ ఏప్రిల్ 14, 2023న విడుదల కానున్నాయి. ఇక మలయాళం హిట్ ఫిల్మ్ మోహన్‌లాల్ ‘లూసీఫర్’కు ‘గాడ్‌ఫాదర్’ తెలుగు రీమేక్ కాగా, తమిళ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతుంది.