January 6, 2022
MaheshBabu-KamalHaasan: ఫస్ట్ అండ్ సెకండ్ కరోనా వేవ్స్ టైమ్‌లో హీరోలు ఎక్కువగా షూటింగ్స్‌లో పాల్గొని కరోనా వైరస్ బారిన పడ్డారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ప్రముఖులకు నమోదు అవుతున్న కరోనా కేసులు అన్నీ కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే అని చెప్పుకోవచ్చు. ముందుగా మహేశ్‌బాబు విషయానికి వస్తే…‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌లో ‘స్పైడర్’ కాలంనాటి గాయం తీరగబెట్టడంతో కాలికి శ్రస్త్ర చికిత్సలో భాగంగా స్పెయిన్ అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లారు మహేశ్‌బాబు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అప్పటికీ కరోనా కేసులు ఎక్కువగా లేవు. కానీప్రపంచవ్యప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మహేశ్‌బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఫ్యామిలీతో కలిసి ఘనంగా దుబాయ్‌లో జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు వంశీపైడిపల్లి కూడా ఉన్నారు.
Read More: Chakda Xpress: జూలన్ గోస్వామిగా అనుష్క శర్మ..టీజర్ అదిరిందిగా…ఈ సెలబ్రేషన్స్ ముగిసిన మూడు రోజుల తర్వాత నుంచి మహేశ్‌కు నలతగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను కాస్త జాగ్రత్తగా జరుపుకుని ఉంటే మహేశ్ కోవిడ్ బారిన పడేవారు కాదు. ఇక మరోవైపు దుబాయ్‌లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు హీరోయిన్ మంచు లక్ష్మీ. ఆమెకు కరోనా పాజిటివ్. ఇక లక్ష్మీమంచుతో కలిసిఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న రకుల్‌ప్రీత్ సింగ్ హెల్త్ వివరాలు తెలియాల్సి ఉంది. ఒక సొంత బ్రాండ్ దుస్తుల కోసం అమెరికా వెళ్లి కరోనా తెచ్చుకున్నారు కమల్‌హాసన్. ప్రస్తుతం కమల్ ఆరోగ్యంగానే ఉన్నారు. ‘విక్రమ్’షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కానీ విదేశాలకు వెళ్లి అక్కడ నిర్లక్ష్యంగా ఉంటూ కరోనా వచ్చిందని ఫ్యాన్స్‌కు చెప్పడం, అభిమానంతో వారు ఆందోళనకు గురి కావడం కరెక్ట్ కాదు. మరోవైపు ఇలా సెలబ్రీటీలకు కరోనా వస్తున్నప్పుడు సమాన్య ప్రజల్లో కూడా కరోనా భయాలు ఇంకా పెరిగిపోతాయి. అందుకనే సినీ స్టార్స్ తమ నిర్లక్ష్యాలకు చరమగీతం పాడాలి.
Read More: ఏపీలో బంగార్రాజు చిత్రాన్ని బ్యాన్ చేయనున్నారా?