KGF 2: మొద‌టిరోజు ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

April 15, 2022

KGF 2: మొద‌టిరోజు ఎంత క‌లెక్ట్ చేసిందంటే?
కన్నడ సినిమా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ పై మొదట ఎటువంటి అంచనాలు లేవు. కానీ ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ ఆడియెన్స్ ను ఆ మూవీ విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో ఆ మూవీని కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.10 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ వస్తుంది అని తెలిసినప్పటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి.అనుకున్నట్టుగానే నిన్న విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుని భారీ వసూళ్ళను రాబడుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ ల పాన్ ఇండియా ఇమేజ్ ఈ మూవీతో మరింత బలపడిందని చెప్పాలి.  ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :నైజాం  : 9.68 కోట్లు సీడెడ్  :  2.84 కోట్లు ఉత్తరాంధ్ర : 1.70 కోట్లు ఈస్ట్ : 1.18 కోట్లు వెస్ట్ : 0.84 కోట్లు కృష్ణా : 0.90 కోట్లు గుంటూరు : 1.12 కోట్లు నెల్లూరు : 0.78 కోట్లు ——————————————————– ఏపి + తెలంగాణ : 19.04 కోట్లు(షేర్) తెలుగు థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఎంతంటే : నైజాం  :  25 కోట్లు సీడెడ్  :  12 కోట్లు ఉత్తరాంధ్ర : 10 కోట్లు ఈస్ట్ : 6 కోట్లు వెస్ట్ : 5 కోట్లు కృష్ణా : 6 కోట్లు గుంటూరు : 7 కోట్లు నెల్లూరు : 3 కోట్లు ——————————————————– ఏపి + తెలంగాణ : 74 కోట్లు‘కె.జి.ఎఫ్2’ చిత్రం క్లీన్ హిట్ అవ్వాలి అంటే  రూ.74 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.19.0 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.55.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ReadMore: Beast Day2 collections: బీస్ట్ 2 రోజుల కలెక్షన్లు

ట్రెండింగ్ వార్తలు