April 6, 2024
సినీ నటి సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. కేవలం సౌత్ సినిమాలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా కూడా ఈమె కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో నాగచైతన్య నటించిన తండేల్ సినిమాలో నటిస్తున్నటువంటి సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయ్యారు. ఇప్పటికే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలు సాయి పల్లవి హీరోయిన్ అవకాశం అందుకున్నారు.
ఇక త్వరలోనే రణబీర్ కపూర్ నటించబోతున్నటువంటి రామాయణం సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయని ఈ సినిమా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో సాయి పల్లవి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారని తెలుస్తుంది.
సాధారణంగా సాయి పల్లవికి సినిమాల పరంగా కథ ప్రాధాన్యత ఉంటే చాలు రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఆలోచించదు. ఇలా కథలు మంచి ప్రాధాన్యత ఉండి ఎలాంటి గ్లామర్ కి తావు లేకుండా ఉంటే ఈమె సినిమాలలో నటించడానికి ఏమాత్రం ఆలోచించదు కానీ మొదటిసారి రెమ్యూనరేషన్ పరంగా నిర్మాతలకు షాక్ ఇచ్చారని తెలుస్తుంది.
ఈ రామాయణం సినిమా కోసం ఈమె ఏకంగా తన రెండు సినిమాలకు తీసుకొనే అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాకు రెమ్యూనరేషన్ పెంచడానికి కారణం లేకపోలేదు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నటువంటి తరుణంలోనే సాయి పల్లవి రెమ్యూనరేషన్ గురించి నిర్మాతలను డిమాండ్ చేశారని సమాచారం ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటున్నటువంటి సాయి పల్లవి ఈ సినిమాకు తన రెమ్యూనరేషన్ డబుల్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఏ మాత్రం తెలియడం లేదు.
Read More: కల్కి కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.. అదే రోజే రాబోతున్న ప్రభాస్!