రాఖీ బాయ్ బర్త్ డే… నిరాశలో అభిమానులు!

January 8, 2024

రాఖీ బాయ్ బర్త్ డే… నిరాశలో అభిమానులు!

కేజిఎఫ్ స్టార్ ,పాన్ ఇండియా సెన్సేషనల్ హీరో యశ్ నేడు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. కన్నడ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో సినిమాలలో నటించినటువంటి ఈయన కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. ఇక కే జి ఎఫ్ సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాల అవుతున్న ఇప్పటివరకు ఈయన నుంచి ఎలాంటి అనౌన్స్ లేదని అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇటీవల యశ్ తన తదుపరి చిత్రం టాక్సిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నేడు హీరో యష్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఉండబోతుంది అంటూ యష్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇకపోతే ఈ నిర్మాణ సంస్థ హీరో యష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

సాధారణంగా ఒక హీరో పుట్టినరోజు అంటే తప్పనిసరిగా ఆ హీరో నటిస్తున్నటువంటి సినిమా నుంచి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారు వారి ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ మేకింగ్ వీడియో కానీ విడుదల చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యశ్ టాక్సిక్ సినిమా నుంచి కూడా ఇలాంటి అప్డేట్ రాబోతుందని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో టాక్సిక్ ప్రొడ్యూసర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

కెవిఎన్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ లో యష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. గతంలో విడుదల చేసిన మోషన్ పోస్టర్ ను మళ్లీ విడుదల చేశారు. ఇలా ఇదివరకు విడుదల చేసినటువంటి మోషన్ పోస్టర్ మరోసారి విడుదల చేయడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయండి అంటూ కొందరు అభిమానులు డిమాండ్ చేయగా మరికొందరు మాత్రం మేకింగ్ వీడియో విడుదల చేయండి అంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read More: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న గుంటూరు కారం ట్రైలర్!

ట్రెండింగ్ వార్తలు