వార్ 2 సెట్ లోకి అడుగు పెట్టిన దేవర..వైరల్ అవుతున్న ఫోటో!

April 12, 2024

వార్ 2 సెట్ లోకి అడుగు పెట్టిన దేవర..వైరల్ అవుతున్న ఫోటో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమాల మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ వార్‌ 2 సినిమాలో నటిస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది.

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే నటుడు హృతిక్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ క్రమంలోనే హృతిక్ ఎన్టీఆర్ పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉండడంతో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి అడుగు పెట్టారు. హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కించే సన్నివేశాలు దాదాపు 30 రోజులపాటు షూటింగ్ పనులను జరుపుకోబోతున్నారట.

అలాగే సోలోగా ఎన్టీఆర్ పై మరో 30 రోజుల పాటు షూటింగ్ జరగబోతుందని తెలుస్తుంది. ఇలా హృతిక్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్న తరుణంలో ఈయన గురువారం ముంబై చేరుకున్నారు. స్కై బ్లూ షర్ట్, జీన్స్ లో ఉన్నారు ఎన్టీఆర్‌. తలపై క్యాప్‌ ధరించారు. స్టయిల్‌గా కెమెరాకి పోజులిచ్చారు. తారక్‌ కోసం బాలీవుడ్‌ మీడియా ఎగబడింది. ఆయన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు.

ప్రస్తుతం ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా 10 రోజులపాటు ఎన్టీఆర్ ముంబైలోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇందులో హీరోగా హృతిక్ నటించగా ఎన్టీఆర్ విలన్ గా నటించబోతున్నారని సమాచారం. ఇద్దరి మధ్య భీకరమైన పోరాట సన్నివేశాలు ఉంటాయట. ఆయా సీన్లని ప్రస్తుత షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నారని సమాచారం https://telugu.chitraseema.org/ravi-teja-committed-back-to-back-movies-in-sithara-entertainments/

 

ట్రెండింగ్ వార్తలు