ఉగ్రం, సలార్ మధ్య తేడాలివే.. ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు

December 22, 2023

ఉగ్రం, సలార్ మధ్య తేడాలివే.. ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు

Difference Between Salaar And Ugram: ఉగ్రం(Ugram) సినిమానే సలార్‌గా ప్రశాంత్ నీల్ రీమేక్ చేస్తున్నాడని వాదన అందరికీ తెలిసిందే. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఎప్పుడో ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పాడు. కానీ ప్రశాంత్ నీల్(Prashanth Neel) మాత్రం ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చాడు. ఇక సలార్(Salaar) రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మెల్లిమెల్లిగా లీక్ చేస్తూ వచ్చాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో అదే సలార్ అని చెప్పుకొచ్చాడు. సరిగ్గా అదే పాయింట్‌తో ఉగ్రంను ప్రశాంత్ నీల్ తీశాడు.

అయితే ఉగ్రం టైంలో ప్రశాంత్ నీల్‌కు ఇచ్చిన బడ్జెట్‌లో తీస్తే.. ఇప్పుడు కేజీయఫ్ సినిమాలతో వచ్చిన బ్రాండ్ ఇమేజ్‌తో భారీ ఎత్తున తీశాడు. ఖాన్సార్ అనే అది పెద్ద క్రూరమైన ప్రపంచాన్ని సృష్టించాడు. ఖాన్సార్ ప్రాంతం చుట్టూ సలార్‌ను నడిపించాడు. అదంతా తన స్నేహితుడికి కట్టబెట్టే మరో మిత్రుడి కథ. ఆ ఇద్దరి మధ్య చంపుకునేంత గొడవ ఎందుకు వచ్చింది? అన్నది ఉగ్రం మెయిన్ పాయింట్.

ఇక సలార్ సైతం అదే లైన్లో సాగుతుంది. తన స్నేహితుడు కోసం ఖాన్సార్‌ను హస్తగతం చేసుకుంటాడు. ఈ ఖాన్సార్ సింహాసనం కోసం మూడు తెగలున్నాయని, వాటి మధ్య పోరు ఉంటుందని ఇందులో కొత్తగా యాడ్ చేసుకున్నాడు. ఉగ్రంలో దీని ప్రస్థావన ఉండదు. ఉగ్రంలో అసలు హీరోకంటూ సపరేట్ ఫ్లాష్ బ్యాక్ ఉండదు. కానీ ఇక ఇందులో మాత్రం అదిరిపోయేలా ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు. ఇక అతని పుట్టుక, శౌర్యాంగ పర్వం అంటూ సలార్ రెండో పార్ట్‌లో చూపించబోతోన్నాడు.

సలార్ రెండో పార్టులో మెయిన్ లీడ్, మెయిన్ పాయింట్ ఏంటన్నది ఉగ్రం చూసిన వారికి తెలుస్తుంది. వరద రాజమన్నార్ తమ్ముడిని దేవా చంపాల్సి వస్తుంది. తమ్ముడిని చంపినందుకే ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారుతారు. ఈ సీన్ సలార్ రెండో పార్టులో హైలెట్ కానుందది. ఇక చివరకు ఈ ప్రాణ స్నేహితుల్లో ఎవరు మిగులుతారు? ఈ ఇద్దరు ఏం అవుతారు? ఖాన్సార్ సింహాసనం చివరకు ఎవరి సొంతం అవుతుంది? అనేది సలార్ శౌర్యాంగ పర్వంలో తెలుస్తుంది.

Read More: సినిమా కోసం అవి వదిలేసిన హీరోయిన్.. శ్రీలీల మామూల్ది కాదు బాబోయ్!

ట్రెండింగ్ వార్తలు