సినిమా కోసం అవి వదిలేసిన హీరోయిన్.. శ్రీలీల మామూల్ది కాదు బాబోయ్!

December 22, 2023

సినిమా కోసం అవి వదిలేసిన హీరోయిన్.. శ్రీలీల మామూల్ది కాదు బాబోయ్!

కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతూ అనంతరం తెలుగులో పెళ్లి సందడి సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి శ్రీ లీల(Sreeleela). ఈ సినిమా పెద్దగా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఈ సినిమాలో ఈమె అందం నటన చూసినటువంటి ప్రేక్షకులు తనకు పెద్ద ఎత్తున అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే శ్రీ లీలకు తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా సినిమాలో ఈమె అవకాశం అందుకోవడం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్రీలీల క్రేజ్ పూర్తిగా మారిపోయింది.

ఈ ఒక్క సినిమా మంచి సక్సెస్ కావడంతో సుమారు డజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఈ యంగ్ హీరోయిన్ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచారు. ఇక శ్రీ లీల(Sreeleela) నటించిన సినిమాలు గత నాలుగు నెలలగా వరుసన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించుకున్న మరికొన్ని సినిమాలు మాత్రం చేదు అనుభవాలనే మిగిల్చాయి.

ఇకపోతే ఇటీవల ఈమె తాను కమిట్ అయినటువంటి సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు అంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈమె ఎంబిబిఎస్ చదువుతున్నటువంటి నేపథ్యంలో ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉన్నందున సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చారు. కానీ సినిమా షూటింగులు ఉండటంతో ఏకంగా సినిమాల కోసం తన ఎంబిబిఎస్ పరీక్షలను కూడా త్యాగం చేశారని తెలుస్తుంది. పరీక్షలను సప్లిమెంటరీలో రాసుకోవచ్చు అని భావించినటువంటి ఈ హీరోయిన్ తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఏది ఏమైనా సినిమాల కోసం శ్రీ లీల తన పరీక్షలను కూడా వదిలేసారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇంకా చదవండి: సలార్ రివ్యూ: కన్‌ఫ్యూజ్డ్ నీల్ కథలో.. హై వోల్టేజ్ యాక్షన్! 

ట్రెండింగ్ వార్తలు