అందుకే ఈ టైటిల్ పెట్టాం.. ఫ్యామిలీ స్టార్ టైటిల్ పై దిల్ రాజు స్పందన!

March 23, 2024

అందుకే ఈ టైటిల్ పెట్టాం.. ఫ్యామిలీ స్టార్ టైటిల్ పై దిల్ రాజు స్పందన!

హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఖుషి సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సరికొత్తగా రాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృనాల్ ఠాకూర్ నటిస్తుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకటేశ్వర బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని మంచి ఆదరణ పొందాయి.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. విడుదలకు ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి ఫ్యామిలీ స్టార్ అనే పేరు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ ను స్టార్ గా చూపించేందుకు చేసిన సినిమా కాదని, ఒక ఫ్యామిలీని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే అని చెప్పటమే ఈ సినిమా ఉద్దేశమని వెల్లడించారు దిల్ రాజు.

మీరంతా ఎక్కడో ఉన్న మీ కుటుంబాలను గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. నేను, ఈ వేదిక మీద ఉన్న ఈ ప్రస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్ నారాయణ మూర్తి గారు మేమంతా సాధారణ జీవితాలతో మొదలై మా రంగాలలో కష్టపడి ప్రయోజకులమై పైకి వచ్చాము. ఇవాళ మా కుటుంబాలకు ఈ సొసైటీలో ఒక పేరు దక్కేలా చేసాం.

ఇలాంటి వారంతా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పటమే ఫ్యామిలీ స్టార్ కధాంశం అని చెప్పారు. హైదరాబాదులో నిర్వహించిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఐడి, హెల్త్ కార్డు, డైరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ టైటిల్ విషయంలో ఈ విధంగా స్పందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Read More: దేవర సినిమా లో మరో హీరోయిన్.. దేవర భార్యగా మరాఠీ భామ ఫిక్స్!

ట్రెండింగ్ వార్తలు