April 8, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన నిర్మాణ సారథంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమాలన్నీ కూడా కాస్త ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయని చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఈయన నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మృణాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయని మేకర్ చెబుతుండగా సినిమా గురించి ఎన్నో కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇలా ఈ సినిమా చూసిన తర్వాత థియేటర్ బయట మీడియాని ప్రశ్నించడంతో సినిమా పెద్దగా బాలేదని అనుకున్న స్థాయిలో సినిమా లేదంటూ కూడా ఎంతోమంది రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే దిల్ రాజు ఈ సినిమా రివ్యూలు తీసుకోవడం కోసం ఏకంగా మైక్ పట్టుకొని థియేటర్ల ముందు నిలబడ్డారు.
ఇలా సినిమా చూసి వచ్చిన తర్వాత స్వయంగా ఆయనే ప్రేక్షకులను రివ్యూ అడుగుతున్నారు. ఇలా తన సినిమా కోసం దిల్ రాజు ఏకంగా మైక్ చేత పట్టుకొని థియేటర్ల ముందు నిలబడటంతో పలువురు ఈ ఫోటోల పట్ల విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి పనులైన చేయడానికి వెనకాడరు అంటూ ఈ ఫోటోల పట్ల నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఇటీవల దిల్ రాజుకు వరుసగా సినిమాలు తీవ్రమైనటువంటి నష్టాలను మిగులుస్తున్నాయి ఇప్పటివరకు మహేష్ బాబు గుంటూరు కారం ద్వారా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేకపోయాయి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని తెలుస్తోంది.
Read More: ఓయమ్మా బాహుబలికి ఈ జీవిని చూస్తే అంత భయమా.. పరువు తీస్తున్నావు కదా డార్లింగ్?