Niharika Konidela: ఆ రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?

March 14, 2024

Niharika Konidela: ఆ రెమ్యూనరేషన్ ఏం చేసిందో తెలుసా?

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఏకైక హీరోయిన్గా గుర్తింపు పొందారు.. నిహారిక ఇండస్ట్రీలోకి తన కుటుంబ సభ్యుల సపోర్ట్ ద్వారా ముఖ్యంగా తన తండ్రి మద్దతు ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నిహారిక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.

ఇక నిహారిక ఇండస్ట్రీకి వచ్చినటువంటి మొదట్లో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించేవారు. ఇలా యాంకర్ గా ప్రారంభమైనటువంటి ఈమె కెరియర్ ప్రస్తుతం హీరోయిన్ గాను నిర్మాత గాను కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే తాజాగా నిహారిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే నిహారిక ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదట్లో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. ఇలా ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించే సమయంలో ఈమె ఒక్కో ఎపిసోడ్ కు కేవలం 20వేల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునేవారట ఇదే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది.

ఇలా ఈమె తన రెమ్యూనరేషన్ మొత్తం తన తండ్రి చేతికే ఇచ్చేదని అయితే అదంతా నాగబాబు తన పేరిట డిపాజిట్ చేశారని నిహారిక తెలిపారు. అయితే మొదట అందుకున్నటువంటి రెమ్యూనరేషన్ తో ఈమె తన తల్లి తండ్రులకు కానుకలు అందించినట్లు తెలిపారు తన తండ్రికి పాటలు వినడం అంటే చాలా ఇష్టమట అందుకే తన తండ్రి కోసం ఒక హెడ్సెట్ కొనుగోలు చేశారని ఇక తన తల్లి కోసం బంగారు ముక్కుపుడక కానుకగా ఇచ్చానని నిహారిక ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: స్వయంభూ సినిమాలో యాడ్ అయిన మరో హీరోయిన్?

ట్రెండింగ్ వార్తలు