పిల్లలను కనాలని ఉంది.. మనసులో కోరికలన్నీ బయటపెట్టిన మెగా డాటర్!

March 15, 2024

పిల్లలను కనాలని ఉంది.. మనసులో కోరికలన్నీ బయటపెట్టిన మెగా డాటర్!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఏకైక హీరోయిన్ అని చెప్పాలి. ఇప్పటివరకు మెగా కుటుంబంలో ఎంతోమంది హీరోలుగా కొనసాగుతున్నారు కానీ హీరోయిన్గా ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ లోకి రాలేదు అయితే నిహారిక మాత్రం ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్నారు.

కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెరకు పరిచయమైనటువంటి నిహారిక అనంతరం ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె మూడు సినిమాల వరకు హీరోయిన్ గా చేసినప్పటికీ ఈ మూడు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు ఈమె పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లారు.

సిని నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నిహారిక ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకి వెళ్లిపోవడంతో ఆమె అక్కడ ఉండలేకపోయింది. తన భర్తతో మనస్పర్ధలు రావడం మొదలవడంతో నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చేసి తిరిగి తన తండ్రి వద్దకే చేరుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగా కెరియర్ పై ఎంతో ఫోకస్ చేసినటువంటి నిహారిక ఒకవైపు హీరోయిన్ గాను మరోవైపు వ్యాఖ్యాతగాను నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన వ్యక్తిగత జీవితం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని తెలిపినటువంటి నిహారిక తనకి కూడా పిల్లలను కనాలనే కోరిక ఉంది అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఇలా నిహారిక తన మనసులో కోరికను బయటపెట్టడమే కాకుండా రెండో పెళ్లి గురించి కూడా పరోక్షంగా కామెంట్లు చేశారు. ఇలా పిల్లలు కావాలని కోరుకునే ఈమె రెండో పెళ్లికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ఇలా తన మనసులో ఉన్నటువంటి కోరికలను ఈమె బయట పెట్టడంతో పలువురు ఈ వ్యాఖ్యలపై విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఆద్య గురించి ఆ విషయం చెప్పిన రేణు దేశాయ్… ఫోటో వైరల్!

ట్రెండింగ్ వార్తలు