ఆ దేశంలో విడుదల కాబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ఫ్యామిలీ స్టార్ రికార్డ్?

April 3, 2024

ఆ దేశంలో విడుదల కాబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ఫ్యామిలీ స్టార్ రికార్డ్?

సాధారణంగా ఒక భాషలో తెరకెక్కినటువంటి సినిమాలు ఒకప్పుడు కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం అయ్యేవి. అయితే ఇప్పుడు మాత్రం వివిధ భాషలలో పెద్ద ఎత్తున ఈ సినిమాలు విడుదల అవుతూ ప్రేక్షకులందరిని సందడి చేస్తున్నాయి. అయితే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారి కోసం సినిమాలను వ్యక్తుల చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ దేశ భాషలలో కూడా కొన్ని సినిమాలను విడుదల చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము.

ఇక ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు ఇతర దేశాలలో అనగా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఇటలీ వంటి దేశాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు సినిమా కానీ విడుదల కానటువంటి దేశంలో మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

పరశురాం డైరెక్షన్లో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమా మొదటిసారి సౌత్ అమెరికాలోని ఉరుగ్వే దేశంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ దేశంలో విడుదల కాబోయే మొట్టమొదటి తెలుగు సినిమాగా ఫ్యామిలీ స్టార్ రికార్డ్ సాధించారు. మరి ఈ దేశంతో పాటు ఓవర్సీస్ లో కూడా ఫ్యామిలీ స్టార్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read More: గ్లాస్ డైలాగ్ పై మరో సారి స్పందించిన పవన్.. మా బాధలు మాకు ఉన్నాయంటున్న డైరెక్టర్!

ట్రెండింగ్ వార్తలు