వాళ్లది టామ్ అండ్ జెర్రీ రిలేషన్.. రామ్ చరణ్ ని అభినందిస్తూ మంచు మనోజ్ స్పీచ్!

March 28, 2024

వాళ్లది టామ్ అండ్ జెర్రీ రిలేషన్.. రామ్ చరణ్ ని అభినందిస్తూ మంచు మనోజ్ స్పీచ్!

ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా మారిన నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మార్చి 27న అతని పుట్టినరోజు కావటంతో అతని ఫ్యాన్స్ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈవెంట్ కి చాలామంది నటులు, బిగ్ బాస్ సెలబ్రిటీలు హాజరయ్యారు. మంచి ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ కూడా ఈ ఈవెంట్ కి అతిధిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్ మొత్తానికి మంచు మనోజ్ స్పీచ్ హైలైట్ అయిందని చెప్పాలి.

రామ్ చరణ్ తో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడుతూ చెన్నైలో ఉన్నప్పుడు మా ఇల్లు, వాళ్ల ఇల్లు పక్క పక్కనే ఉండేవి. దాని వలన అందరం కలిసి మెలిసి పెరిగాము. రామ్ చరణ్ ఎంత ఎదిగినా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరిని మర్చిపోలేదు. అందరినీ గుర్తుపెట్టుకుంటాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆదుకుంటాడు. ఈ గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది అంటూ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చాడు మంచు మనోజ్.

దుబాయిలో ఒక తెలుగు ఆడపిల్లకి కష్టం వచ్చింది, ఇమిగ్రేషన్ సమస్య వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లాక్ చేసేసారు. నాకు వీలైనంత వరకు సహాయం చేశాను, ఇంకా కావాలి ఎవరిని అడగాలి అని ఆలోచిస్తుండగా రాంచరణ్ గుర్తుకు వచ్చాడు వెంటనే ఫోన్ చేశాను. విషయం చెప్పి ఐదు లక్షలు కావాలి అని అడిగాను అకౌంట్ నెంబర్ పంపించు అని రాంచరణ్ చెప్పాడు.

ఎకౌంటు నెంబర్ పంపించగానే క్షణాల వ్యవధిలో ఐదు లక్షలు సాయం చేశాడు అని మంచు మనోజ్ చెప్పారు. ఇక చిరంజీవి మోహన్ బాబు మధ్య ఉన్న విభేదాల గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరి రిలేషన్ టామ్ అండ్ జెర్రీ రిలేషన్ గొడవ పడుతూ ఉంటారు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. మెగా ఫ్యామిలీ మంచు ఫ్యామిలీల మధ్య రిలేషన్ ఫిష్ అండ్ వాటర్ లా ఉండాలి అంతేకానీ ఫిష్ అండ్ ఫిషర్మెన్ లాగా కాదు అంటూ పెదరాయుడు సినిమాలో డైలాగ్ చెప్పి అందరినీ అలరించాడు మంచు మనోజ్.

Read More: 11 మంది హీరోలని పరిచయం చేస్తూ మెగా డాటర్ తీస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్.. టైటిల్ గా కమిటీ కుర్రాళ్ళు!

ట్రెండింగ్ వార్తలు