అభిమాన హీరోల పుట్టినరోజులు కోసం .. ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులు!

February 27, 2024

అభిమాన హీరోల పుట్టినరోజులు కోసం .. ఆత్రంగా ఎదురుచూస్తున్న అభిమానులు!

అభిమాన హీరోలకి పుట్టినరోజులు దగ్గర పడుతున్న కొద్దీ అసలు వాళ్ళ సంగతి ఏమోగానీ అభిమానులు మాత్రం తెగ హడావుడి పడిపోతూ ఉంటారు. రక్తదాన శిబిరాలతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో బిజీ అయిపోతారు. అయితే ఫేవరెట్ హీరోలకు సంబంధించిన పుట్టినరోజులు దగ్గర పడుతుంటే అభిమానులు ఆనంద పడటానికి మరొక కారణం కూడా ఉంది. అదేమిటంటే ప్రస్తుతం వారు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు బయటికి వస్తాయి.

ఇప్పుడు అదే ఆత్రుత అల్లు అర్జున్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులలో నెలకొని ఉంది. ఎందుకంటే రానున్న మార్చి ఏప్రిల్ నెలలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ పుట్టినరోజులు వస్తున్నాయి. ఈ సందర్భంగా వాళ్ళు చేస్తున్న సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అనౌన్స్ చేస్తారు మూవీ మేకర్స్. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా విడుదల తేదీని ఆయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోనే జరుగుతుంది. ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8. అందుకే ఆరోజు పుష్ప టు టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు మూవీ టీం. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార ఏర్పాట్లు వచ్చే నెల నుంచి చేయబోతున్నట్లు సమాచారం.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటంతో పుష్ప 2 పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

Read More: డిప్రెషన్ లో ఉన్నానంటున్న జస్వంత్.. విచారణలో మరిన్ని విషయాలు వెల్లడి!

ట్రెండింగ్ వార్తలు