ఎన్టీఆర్ `స్టూడెంట్‌ నెంబర్ 1` కి ఫ‌స్ట్ చాయిస్ ఎవ‌రో తెలుసా?

August 11, 2022

ఎన్టీఆర్ `స్టూడెంట్‌ నెంబర్ 1` కి ఫ‌స్ట్ చాయిస్ ఎవ‌రో తెలుసా?

ప్రభాస్, ఎన్టీఆర్‌…ఇద్దరికి దర్శకుడు రాజమౌళి వారి కెరీర్స్‌లో అద్భుతమైన హిట్స్‌ ఇచ్చాడు. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1, యమదొంగ, ఆర్‌ఆర్‌ఆర్‌ (ఇందులో రామ్‌చరణ్‌ మరో హీరో) వంటి హిట్‌ సినిమాలను ఎన్టీఆర్‌తో తీస్తే…ఇటు ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ వంటి సినిమాలను ప్రభాస్‌కు ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. అయితే ఎన్టీఆర్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లో ‘ఆది’, ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ మాంచి హిట్స్‌గా నిలిచాయి. ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీలో మరో మెట్టు ఎక్కించాయి. ఆది చిత్రం ఎన్టీఆర్‌కు మాస్‌ ఇమేజ్‌ను తీసుకు వస్తే…స్టూడెంట్‌ నెంబర్‌ 1 చిత్రం క్లాస్‌ ఇమేజ్‌ను తీసుకువచ్చింది.

అయితే ఇప్పుడు ఆసక్తికరంగా ‘స్టూడెంట్‌ నెంవర్‌ 1’ చిత్రం మళ్లీ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాలో హీరోగా ఫస్ట్‌ను ప్రభాస్‌నే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్‌ తండ్రి, దివంగత ప్రముఖ నటులు హరికృష్ణ ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ చిత్రం కోసం ఎన్టీఆర్‌ను రికమెండ్‌ చేశారు. దీంతో ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ వంటి సూపర్‌హిట్‌ మూవీలో నటించే అవకాశాన్ని కోల్పోయారు ప్రభాస్‌. ఈ విషయాన్ని అశ్వనీదత్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఒక్కసారిగా సోషల్‌మీడియాలో స్టూడెంట్‌ నెంబర్‌ 1 ప్రస్థావనను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్‌ సొంతంగా ఎదిగారు అంటారు కానీ తెరవెనక ఇలాంటి రికమెండేషన్స్‌ కూడా ఉన్నాయన్నమాట అని కొందరు నెటిజన్లు వ్యగ్యంగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు