ఓయమ్మా బాహుబలికి ఈ జీవిని చూస్తే అంత భయమా.. పరువు తీస్తున్నావు కదా డార్లింగ్?

April 8, 2024

ఓయమ్మా బాహుబలికి ఈ జీవిని చూస్తే అంత భయమా.. పరువు తీస్తున్నావు కదా డార్లింగ్?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న అటువంటి ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఎలాంటి సమస్య వచ్చిన ఎంతో చాకచక్యంగా సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో పెద్దపెద్ద క్రూర జంతువులతో కూడా ఈయన పోటీ పడుతూ ఉన్నట్లు చూపిస్తారు. ఇలా బాహుబలి సినిమాలో ప్రభాస్ మీద ఎంతో గొప్పగా చూపించారు కానీ నిజ జీవితంలో ప్రభాస్ ఒక చిన్న జీవికి భయపడతారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక సినిమా ప్రమోషన్లలో భాగంగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు ఒక ప్రశ్న ఎదురయింది. ప్రభాస్ కి దేనిని చూస్తే భయం వేస్తుంది దేనికి ఈయన వెంటనే భయపడిపోతారనే ప్రశ్న ఎదురు అయ్యింది. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను దేనికి భయపడతాను అంటే బల్లిని చూస్తే మాత్రం అక్కడ ఒక నిమిషం కూడా ఉండనని తెలిపారు. నాకు బల్లిని చూస్తే చాలా భయంగా ఉంటుంది అంటూ ఈయన కామెంట్లు చేశారు.

పాము ఇతరతా వాటిని చూసిన నాకు భయం కాదు కానీ బల్లి ఉంటే మాత్రం తన బాడీ మొత్తం షవరింగ్ అవుతుందని ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో పై ఎంతో మంది నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి బల్లికి భయపడటం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేయగా అన్న మీరు డైనోసార్ ఆఫ్టర్ బల్లికి భయపడుతున్నారా బల్లి అంటే భయం అని చెబుతూ పరువు తీసేస్తున్నారు కదా అంటూ అభిమానులు కామెంట్ లు చేస్తున్నారు.

Read More: కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రష్మిక మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు