గామి చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా!

March 7, 2024

గామి చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా!

ప్రస్తుతం గామి సినిమా మానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించిన ప్రస్తావనే జరుగుతుంది. అద్భుతమైన విజువల్స్ తో ట్రైలర్ ఉండటంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. టేకింగ్, విఎఫ్ఎక్స్, హీరో విశ్వక్ సేన్ యాక్టింగ్ అన్ని ట్రైలర్ లో చాలా బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్. దర్శకులు నాగ అశ్విన్, సందీప్ రెడ్డివంగా వంటి వారు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ చిత్రాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళి ఈ విధంగా రాసుకొచ్చారు. అసాధ్యమైన కలలు.. కానీ వాటిని సహకారం చేసుకునేందుకు అలుపెరగకుండా కష్టపడ్డారు.అద్భుతమైన విజువల్స్ సాధించేందుకు తాము పడిన నాలుగేళ్ల కష్టాన్ని నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ చెప్పినప్పుడు నాకు కలిగిన భావన ఇది.

మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ టీం మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను అని పేర్కొన్నారు. రాజమౌళి ప్రశంసలు సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసాయి.ఈ సినిమా కోసం దర్శకుడు విద్యాధర్ ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఎంతో పరిశోధన చేసినట్లు తెలిపారు. మంచి అవుట్ పుట్ ఇవ్వడం కోసం, తక్కువ బడ్జెట్లో చేయటం కోసం ఎక్కువ సమయం తీసుకుంది గామి టీం. ఈ నగరానికి ఏమైంది సినిమా ముందు నుంచే గామి చేస్తున్నారు హీరో విశ్వక్ సేన్.

ఈ సినిమాలో అఘోర పాత్ర చేస్తున్నారు విశ్వక్ సేన్. మానవుల స్పర్శతో తనకున్న సమస్యను పరిష్కరించుకోవటానికి హిమాలయాల్లోని త్రివేణి ఘాట్ వద్దకు సాహసోపతమైన ప్రయాణాన్ని చేయడం గురించే గామి మూవీ ఉండబోతుంది. ఈ సినిమాని చాలా శాతం హిమాలయాల్లోనే చిత్రీకరించారు.ఈ సినిమాకి విశ్వనాథరెడ్డి సినిమాటోగ్రఫీ చేయగా నరేష్ కుమారన్ సంగీతం అందించారు. కార్తీక్ శబరీష్ సినిమాని నిర్మించగా, వీ సెల్యులాయిడ్స్ సమర్పిస్తోంది.

Read More: బాలీవుడ్ కొమ్ములు విరిసిన ఈ దర్శకుడు .. ఎవరో గుర్తుపట్టారా!

ట్రెండింగ్ వార్తలు