ఓటీటీ విడుదలకు సిద్ధమైన విశ్వక్ సేన్ గామి.. ఎప్పుడంటే?

April 4, 2024

ఓటీటీ విడుదలకు సిద్ధమైన విశ్వక్ సేన్ గామి.. ఎప్పుడంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో విభిన్నమైనటువంటి కథ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకున్నటువంటి నటుడు విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఈ ఏడాది శివరాత్రి పండుగను పురస్కరించుకొని మార్చి 8వ తేదీ గామీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ద్వారా విద్యాధర్ కాగిత డైరక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ . తమడా మీడియా, వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమాలో విజువల్స్ హాలీవుడ్ స్దాయిలో ఉన్నాయంటూ ప్రేక్షకుల నుండి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది.

ఇలా థియేటర్లో ఎంతో విజయవంతంగా ఈ సినిమా పూర్తి కావడంతో త్వరలోనే ఓటీటీలో విడుదల కావడానికి కూడా సిద్ధమవుతోంది.జీ5 ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది అందుబాటులో ఉండనుంది. ఈవిషయాన్ని మూవీ టీమ్ తో పాటు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించారు. ఈ సినిమాలో ఈయన ఒక అఘోరా పాత్రలో కనిపించబోతున్న సంగతి మనకు తెలిసిందే. థియేటర్లోకి మంచి సక్సెస్ అయినటువంటి ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read More: విజయ్ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ రివ్యూ ఏంటంటే?

ట్రెండింగ్ వార్తలు