అల్లు అర్జున్ తన లవ్ స్టోరీని ముందుగా ఆ హీరోయిన్ కి చెప్పారా.. ఎందుకంటే?

March 8, 2024

అల్లు అర్జున్ తన లవ్ స్టోరీని ముందుగా ఆ హీరోయిన్ కి చెప్పారా.. ఎందుకంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమెను మొదటిసారి ఒక నైట్ క్లబ్లో చూసారట అలాంటి నైట్ క్లబ్లో కూడా స్నేహారెడ్డి చాలా డీసెంట్ గా ఉన్నారని ఈయన చూడగానే తనతో ప్రేమలో పడ్డారట ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉండి 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇక ఇటీవల 13వ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తన భార్యకు స్పెషల్ విషెస్ తెలిపారు.

ఇలా అల్లు అర్జున్ పెళ్లి రోజు సందర్భంగా అల్లు అర్జున్ ప్రేమ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈయన స్నేహారెడ్డిని ప్రేమించిన తర్వాత తన ప్రేమ విషయాన్ని ఇద్దరికీ మాత్రమే తెలిపారట. ఆ ఇద్దరిలో సమంత ఒకరు అంటూ గతంలో సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ ఈ విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా నా ప్రేమ విషయాన్ని సమంతకు తెలియ చేసానని అసలు సమంతకు ఎందుకు చెప్పానో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని ఈయన తెలియజేశారు. ఇలా తన గురించి అల్లు అర్జున్ చెప్పడంతో సమంత కూడా రియాక్ట్ అవుతూ అవును ఆ రోజు మీరు ఒక చిన్న పిల్లాడిలా టెన్షన్ పడ్డారు మీ ప్రేమను స్నేహ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఎంతో కంగారు పడిపోయారు అంటూ సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: విక్రమార్కుడు 2 రాబోతోందా.. ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన ప్రొడ్యూసర్?

ట్రెండింగ్ వార్తలు