చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా స్టోరీ లీక్… ఫైర్ అవుతున్న ఫాన్స్?

March 20, 2024

చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా స్టోరీ లీక్… ఫైర్ అవుతున్న ఫాన్స్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ వైజాగ్ లో జరుగుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వస్తుంది.

ఇకపోతే ఈ సినిమా గురించి అప్డేట్స్ కావాలి అంటూ గత కొద్ది రోజులుగా మెగా ఫాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ ఇదేనట్టు స్టోరీ మొత్తం లీక్ చేయడంతో మెగా ఫాన్స్ మంది పడుతున్నారు.

ఈ సినిమా స్టోరీ లైన్ గురించి అమెజాన్ వారు స్పందిస్తూ.. పాలనలో మార్పులు తీసుకురావడం కోసం ఒక నిజాయితీపరుడైనటువంటి ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఏ విధంగా పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా స్టోరీ అంటూ అమెజాన్ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇలా ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా స్టోరీని ఎందుకు లీక్ చేశారని మండిపడుతున్నారు కథ మొత్తం ముందే తెలిస్తే ఇక సినిమాలో ఏం కిక్ ఉంటుంది అంటూ ఫైర్ అవుతున్నారు. ఇకపోతే ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే హీరోయిన్స్ కూడా ఒకరు అంజలి కాగా మరొకరు కియరా అద్వానీ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

Read More: పెళ్లికూతురులా ముస్తాబైన తమన్నా.. పెళ్లెప్పుడు అంటున్న నేటిజన్స్?

ట్రెండింగ్ వార్తలు