న‌టుడు, నిర్మాత ఘట్టమనేని రమేశ్ బాబు క‌న్నుమూత‌

January 8, 2022

న‌టుడు, నిర్మాత ఘట్టమనేని రమేశ్ బాబు క‌న్నుమూత‌

సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా రమేశ్ బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

అల్లూరి సీతారామరాజు (1974) చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశారు ర‌మేష్ బాబు. కృష్ణ, మహేశ్ బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. నా ఇల్లే నా స్వర్గం, అన్నా చెల్లెలు, పచ్చతోరణం, ముగ్గురు కొడుకులు, సామ్రాట్, చిన్ని కృష్ణుడు, కృష్ణగారి అబ్బాయి, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, చివరిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్ కౌంటర్ చిత్రంలో నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్ బాబు 2004లో నిర్మాతగా మారారు. మ‌హేశ్ బాబుతో అర్జున్, అతిథి సినిమాలు నిర్మించారు. ఆయ‌న మ‌ర‌ణవార్త ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. మ‌హేశ్ కోవిడ్‌తో ప్ర‌స్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు