August 28, 2022
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపు దిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కావాల్సింది. కానీ టాలీవుడ్ సినిమాల షూటింగ్ ఇష్యూలు, మహేశ్‌బాబు విదేశీ వేకేషన్ గట్రా అంశాలతో ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఇండస్ట్రీలోని సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయని షూటింగ్‌లు జరుపుకోవచ్చిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రక టించింది. అయినా మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ కరెక్ట్‌గా ఎప్పుడు మొదలు వుతుందో తెలియని పరిస్థితి.
ఈ సినిమాతో పాటుగా పవన్‌కళ్యాణ్, సాయిథరమ్తేజల కాంబినేషన్లోని ‘వినోదహితం’(తమిళ చిత్రం ‘వినోదాయచిత్తమ్’ తెలుగు రీమేక్) సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారట. అలాగే త్రివిక్రమ్ తన సొంత బ్యానర్‌లా ఫీలయ్యే సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ బంధువుల కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నారట. ఈ సినిమాకు స్క్రిప్ట్‌పై కూడా త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నారట. ఇలా తన సినిమాపై కాకుండా త్రివిక్రమ్ మల్టీఫుల్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టడం అనే అంశం మహేశ్‌కు అంతగా రుచించడం లేదని భోగట్టా. అందుకే మహేశ్ కావాలనే ఈ సినిమా షూటింగ్‌ను ఆలస్యం చేస్తున్నాడన్నది గాసిప్ రాయుళ్ల మాట.
మరోవైపు మహేశ్‌బాబు కెరీర్లో 28వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను హారికా హాసిని బ్యాన ర్‌పై చినబాబు నిర్మించనున్నారు. ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసే ఆలోచనతోనే మహేశ్‌బాబుకు దాదాపు 70 కోట్ల పారితోషికాన్ని ఇచ్చారట చినబాబు. కానీ ఈ సినిమాను దక్షిణాది భాషల వరకే పరి మితం చేయాలన్నది మహేశ్ డిమాండ్ అట. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సినిమాతో హిందీలో పరిచయం అయితే తన క్రేజ్, మార్కెట్ మరింత బాగుంటుందని మహేశ్ ఆలోచిస్తున్నారట. కానీ హిందీ రిలీజ్ లేకపోతే శాటిలైట్, డబ్బింగ్ రైట్స్లకు సంబంధించిన డబ్బులు పోతాయని చినబాబు ఆందోళన పడుతున్నారట. ఒకవేళ హిందీ రిలీజ్ లేకపోతే మహేశ్‌కు 70 కోట్ల రెమ్యూనరేషన్ ఎలా వర్కౌట్ అవుతుందా? అని చినబాబు సమాలోచనలు చేస్తున్నారట. ఇటు త్రివిక్రమ్‌తో మల్టీఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్, అటు నిర్మాతతో హిందీ రిలీజ్ సమస్య..ఇలా మహేశ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 28, 2023న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిం చారు. మరి…అనుకున్న సమయానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందా? చెప్పిన తేదీకి మహేశ్ థియేటర్స్‌కు వస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.