July 4, 2022
చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చుని ఉన్న ‘గాడ్‌ఫాదర్’ ఫస్ట్‌లుక్ మెగా మార్వలెస్ గా వుంది. అలాగే చిరంజీవి పాత్రను పరిచయం చేసే గ్లింప్స్ లో…ఒక కార్యాలయం వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు అతని కోసం వేచి ఉండగా, మెగాస్టార్ చిరంజీవి అంబాసిడర్ కారులో రావడం, సునీల్ కార్ డోర్ తీయగా గాడ్ ఫాదర్ గా చిరంజీవి కారు నుండి బయటకు వచ్చి, ఆఫీస్ లోకి ఫిరోషియస్ గా నడుచుకుంటూ రావడం చూడొచ్చు. గాడ్ ఫాదర్ టైటిల్ మెగాస్టార్ ఆహార్యాన్ని చక్కగా నప్పింది. ఈ గ్లింప్స్ ని థమన్ బీజీఎం మరింత ఎలివేట్ చేసింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించననున్నారు.
గాడ్‌ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి , ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు.