GodFather: చిరంజీవి గాడ్‌ఫాద‌ర్‌లో `స‌త్య‌ప్రియ‌జైదేవ్‌`గా న‌య‌న‌తార

September 8, 2022

GodFather: చిరంజీవి గాడ్‌ఫాద‌ర్‌లో `స‌త్య‌ప్రియ‌జైదేవ్‌`గా న‌య‌న‌తార

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). మలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ ఖాన్‌, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ‘గాడ్‌ ఫాదర్’ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఫుటేజీపై చిరంజీవి అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని, మ‌ళ్లీ రీషూట్ కి ఆదేశించార‌ని, దాంతో రిలీజ్ డేట్ మారుతుంద‌ని ప‌లు వెబ్‌సైట్లు, మీడియా సంస్థ‌లు ప్ర‌చారం చేశాయి. అయితే ఈ వదంతుల‌పై క్లారిటీ ఇచ్చారు చిత్ర నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్‌…“అనుకున్న స‌మ‌యానికే ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం విడుదలవుతుందని, త్వరలోనే ప్రచారాన్ని ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. దానిలో భాగంగానే స‌త్య‌ప్రియ‌జైదేవ్‌గా న‌య‌న‌తార టీజ‌ర్‌ని త్వ‌ర‌లో రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Nayanatara

తమన్‌ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్‌. వి. ప్రసాద్‌తోపాటు రామ్‌ చరణ్‌, ఆర్‌.బి. చౌదరి నిర్మిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు