టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

March 18, 2024

టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించినటువంటి గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఇందులో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

తల్లి సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా టాక్ పరంగా కాస్త మిశ్రమ స్పందన సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగానే వసూలు రాబట్టింది. ఇలా ప్రేక్షకులను థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ ఫ్లిక్స్ వారు కైవసం చేసుకున్నారు. ఇక ఇక్కడ మాత్రం ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించింది.

ఇకపోతే ఈ సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే  ఈ సినిమాని ఉగాది పండుగను పురస్కరించుకొని ఏప్రిల్ 9వ తేదీ ప్రసారం చేయబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను జెమిని టీవీ ఛానల్ రిలీజ్ చేయడం జరిగింది.

ఇలా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతున్నటువంటి ఈ సినిమా ఇక్కడ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని సమాచారం.

Read More: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓజీ నుంచి రానున్న బిగ్ అప్డేట్!

ట్రెండింగ్ వార్తలు