HanuMan Trailer: ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు అద్భుతంగా వుంటుంది – ప్రశాంత్ వర్మ

December 19, 2023

HanuMan Trailer: ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు అద్భుతంగా వుంటుంది – ప్రశాంత్ వర్మ

ఒరిజినల్ సూపర్ హీరో ‘హను-మాన్’ ట్రైలర్(Hanuman Trailer) కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. హీరో తేజ సజ్జ(Teja Sajja), దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) మాగ్నమ్ ఓపస్ ‘హను-మాన్’ థియేట్రికల్ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అఖండ భారతంలోని ఇతిహాసాల నుండి ప్రేరణ పొందిన ట్రైలర్ లోని మొదటి ఫ్రేమ్ మనల్ని ఫాంటసీ యూనివర్స్ అంజనాద్రి లోకి తీసుకువెళుతుంది. అండర్ వాటర్ సీక్వెన్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో ‘యథో ధర్మ తతో హనుమా… యథో హనుమ తతో జయ… (ధర్మం ఉన్నచోట హనుమంతుడు వుంటారు. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది) అనే శ్లోకంతో నక్షత్రంలా మెరుస్తున్న ముత్యపు చిప్పకు దగ్గరగా కథానాయకుడు వెళుతున్నట్లు అద్భుతంగా ప్రజంట్ చేశారు.

అంజనాద్రి నిజమైన అందం జలధార గల హనుమాన్ పర్వత శ్రేణిలో వుంది. అక్కడ భారీ హనుమాన్ విగ్రహం మహా అద్భుతంగా దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో రఘునందన శ్లోకం గూస్‌బంప్స్ తెప్పించింది. కథానాయకుడు చిరుతతో పాటు పరిగెత్తడం, కొండను ఎత్తడం విలన్ ని కొట్టే యాక్షన్ దృశ్యాలు సూపర్ పవర్ తో అద్భుతంగా వున్నాయి. తర్వాత సైన్స్ సహాయంతో సూపర్ పవర్‌లను కనిపెట్టిన యాంటీహీరో వస్తాడు. తనని ప్రపంచంలో తిరుగులేని శక్తిగా చేసే పవర్ కోసం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. తన రాకతో ప్రతిదీ నాశనం చేస్తాడు, పిల్లలను కూడా విడిచిపెట్టడు. హీరోపై కూడా క్రూరంగా దాడి చేస్తారు. ధర్మాన్ని చీకటి కమ్మినపుడు, పూర్వీకులు మళ్లీ వస్తారు. చివరకు హనుమంతుని అద్భుత దర్శనం జరుగుతుంది. టీజర్‌లో హనుమంతుడు ఐస్ క్యూబ్‌లో శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు చూపించగా, దానిని పగలగొట్టి, ధర్మాన్ని రక్షించడానికి బయటకు వస్తారని ట్రైలర్‌ సూచిస్తోంది. నెక్స్ట్ లెవల్ ఎలిమెంట్స్ తోగూస్‌బంప్స్ తెప్పించింది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ కృషి ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో కనిపించింది. అద్భుతమైన యునివర్స్ ని సృష్టించి, పాత్రలతో పాటు మనల్ని ప్రయాణించేలా చేసి విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. సైన్స్ వర్సెస్ ఆధ్యాత్మికత అద్భుత కథ-చెప్పడంలో ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తోంది. సూపర్ పవర్స్‌ని పొంది, ప్రపంచాన్ని రక్షించే అండర్‌డాగ్ పాత్రకు తేజ సజ్జా యాప్ట్ చాయిస్. ఆకట్టుకునే లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ తో తేజ సజ్జ ఆ పాత్రలో ఒదిగిపోయారు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆ పాత్రను నేర్పుగా పోషించారు. వినయ్ రాయ్ తన విలనీ యాక్షన్ తో భయపెట్టారు. సముద్రఖని సాధువుగా తన ప్రజెన్స్ ని చాటారు. తేజకు అక్కగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించారు. గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్‌లు కూడా స్పేస్‌ని దక్కించుకున్నారు.

దాశరధి శివేంద్ర ప్రతి ఫ్రేమ్‌ను లార్జర్-దాన్-లైఫ్ గా చిత్రీకరించారు. అంజనాద్రి అందాన్ని అత్యుత్తమంగా ప్రజంట్ చేశారు. హరి గౌర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా వుంది. యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా కొరియోగ్రఫీ చేశారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా వుంది. ఎడిటర్ సాయిబాబు తలారి ట్రైలర్‌ను షార్ఫ్ గా కట్ చేశారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణ విలువలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయి. టీజర్ ఎక్సయిట్‌మెంట్‌ను క్రియేట్ చేయగా, ట్రైలర్ హైప్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ట్రైలర్ కట్.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. మనందరి ఇష్టదైవం హనుమంతుడు. ఆయనే రియల్ సూపర్ హీరో. మా స్కూల్ డేస్ లో పురాణ పురుషులు గురించి చెప్పేవారు. కానీ ఈ జనరేషన్ పిల్లలు చాలా మందికి అది రీచ్ కావడం లేదు. మన పురాణంలోని పాత్రలని స్ఫూర్తిగా తీసుకుంటూ నేటి జనరేషన్ కి తగట్టు, వాళ్ళకి నచ్చేలా ఈ యూనీవర్స్ ని బిల్డ్ చేశాను. హనుమాన్ తో మొదలైన ఈ యూనీవర్స్ తర్వాత అధిరాతో పాటు కొందరు సూపర్ హీరోలని కూడా బిల్డ్ చేశాం. ఇవన్నీ ముందుకు వెళ్ళాలంటే ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. నా ముందు సినిమాలన్నీ కలిపితే ఎంత టైం పట్టిందో ఈ ఒక్క సినిమాకి అంత పట్టింది. ఆ క్యాలిటీ మీకు ఇచ్చానని నమ్ముతున్నాను. మీకు టీజర్ కంటే ట్రైలర్(HanuMan Trailer) నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు అద్భుతంగా వుంటుంది. తప్పకుండా థియేటర్ లో చూడండి. హనుమాన్ కంటెంట్ పరంగా పెద్ద సినిమా. సంక్రాంతి లాంటి పండక్కి హనుమాన్ లాంటి సినిమా రావడం కరెక్ట్ అని మేము నమ్మాము. హిందీలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో చాలా ఎక్కువ థియేటర్స్ విదుదలౌతుంది. తెలుగులో సుమారుగా 400 థియేటర్స్ అనుకుంటే హిందీలో దాదాపు 1500 థియేటర్స్ లో విదుదలౌతుంది.అన్నారు

Read More: డంకీ ప్రమోషన్స్ కోసం దుబాయ్‌లో షారూక్.. హద్దుల్లేని అభిమానుల ఆనందం

ట్రెండింగ్ వార్తలు