భారీ బడ్జెట్ తో తేజ సజ్జ నెక్స్ట్ మూవీ.. హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన రితిక నాయక్

April 6, 2024

భారీ బడ్జెట్ తో తేజ సజ్జ నెక్స్ట్ మూవీ.. హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన రితిక నాయక్

బాల నటుడిగా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన నటుడు తేజ సజ్జ ఇప్పుడు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ని ఒక ఊపు ఊపేస్తున్నాడు. ఇంతకుముందు అతను చేసిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి దృష్టి తేజ తర్వాత చేయబోయే సినిమా మీదే ఉంది. తేజ కూడా చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాడు.

తేజ తన తర్వాత సినిమాని కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.కార్తీక్ ఘట్టమనేని ఇంతకుముందు మాస్ మహారాజా రవితేజతో ఈగల్ సినిమా తీశాడు. ఇప్పుడు ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ నటిస్తున్న సినిమాకి మిరాయ్ అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. అంతవరకు ఓకే కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో అనే సస్పెన్స్ ఇప్పటివరకు నెలకొంది. అయితే హీరోయిన్ విషయంలో కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం, నానితో హాయ్ నాన్న సినిమాలో నటించిన రితిక నాయక్ ఈ సినిమాలో తేజ కి జోడిగా నటించబోతుంది. ఈ అమ్మాయి ఢిల్లీకి చెందిన మోడల్. ఇప్పటికే కధా చర్చలు పూర్తయిన నేపథ్యంలో ఆమెకి స్క్రిప్ట్ బాగా నచ్చటంతో సినిమా చేసేటందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. రితిక నాయక్ తేజ కి జోడిగా సెట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ మరొకదానాయకుడిగా నటిస్తున్నాడు.

మరి అతనికి జోడి ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా ముందు చిన్న సినిమాగా తీయాలి అనుకున్నారంట కానీ తేజ సజ్జ కి పెరిగిన మార్కెట్ దృష్ట్యా ఇప్పుడు భారీగానే బడ్జెట్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 40 నుంచి 45 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టబోతున్నట్లు సమాచారం. దాంతోపాటు భారీ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు.

Read More: కొత్త ప్రాజెక్టులతో టాలీవుడ్ హీరోలు.. కళకళలాడుతున్న తెలుగు చిత్ర సీమ!

ట్రెండింగ్ వార్తలు