ఆ సినిమాకు గుడ్‌ బై చెప్పనున్న పవన్‌కళ్యాణ్‌…టెన్షన్లో నిర్మాత

July 5, 2022

ఆ సినిమాకు గుడ్‌ బై చెప్పనున్న పవన్‌కళ్యాణ్‌…టెన్షన్లో నిర్మాత

స్టార్‌ హీరో పవన్‌కళ్యాణ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’. క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ సినిమాకు దర్శకుడు. ఏమ్‌ రత్నం నిర్మిస్తున్నాడు. నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే యాభై శాతానికి పైగా పూర్తయింది. అయితే ఈ సినిమా సెకండాఫ్‌ విషయంలో పవన్‌ కళ్యాణ్‌ అసంతృప్తితో ఉన్నాడట. ఇటు బడ్జెట్‌ సమస్యలు కూడా చుట్టు ముట్టాయి. దీంతో ఈ సినిమా ఆల్మోస్ట్‌ క్యాన్సిల్‌ అవుతుందనే టాక్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే నిర్మాత ఏఎమ్‌ రత్నంతో పవన్‌కళ్యాణ్‌ త్వరలో భేటీ కానున్నట్లుగా తెలిసింది. ఈ మీటింగ్‌ అనంతరం ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే చాన్సెస్‌ ఉన్నాయి

ట్రెండింగ్ వార్తలు