January 6, 2022
హీరో మహేశ్‌బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని గురువారం రాత్రి మహేశ్‌బాబు ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు అందరు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సినదిగా కోరుతున్నాను. అలాగే అందరూ కరోనా పట్ల అందరుజాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. దయచేసి అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి. ఎవరైనా ఇప్పటివరకు వేయించుకోక పోతే వెంటనే వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఇది కోవిడ్ తీవ్రతను తగ్గిస్తుంది’’ అనిమహేశ్‌బాబు ట్వీట్ చేశారు. ఇక మహేశ్‌బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఏప్రిల్ 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Readmore: ఆర్‌ఆర్‌ఆర్ ఇంట్రవెల్ సీన్ ఎన్ని రోజులు తీశారో తెలుసా!