హృతిక్ రోషన్ `ఫైట‌ర్‌`కి డ‌ల్‌గా అడ్వాన్స్ బుకింగ్స్..షాక్‌లో టీమ్‌

January 24, 2024

హృతిక్ రోషన్ `ఫైట‌ర్‌`కి డ‌ల్‌గా అడ్వాన్స్ బుకింగ్స్..షాక్‌లో టీమ్‌

బ్యాంగ్ బ్యాంగ్, వార్‌, పఠాన్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలతో యాక్ష‌న్ మూవీ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు సిద్ధార్థ్‌ ఆనంద్..ప్ర‌స్తుతం ఆయ‌న హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఏరియల్ యాక్షన్ డ్రామా ‘ఫైటర్` కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్యాంగ్ బ్యాంగ్, వార్, వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ – హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ‘ఫైటర్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించ‌డం కూడా సినిమాపై హైప్ పెంచింది.

ఈ సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విడుదల చేస్తున్నారు. కాని ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా నుండి వ‌చ్చిన ఒక్క అప్డేట్ కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌లేక పోయింది. గురువారం రిలీజ్ చేస్తే మరునాడు రిపబ్లిక్ డే హాలిడే కావడం, ఆ తర్వాత వీకెండ్ వస్తుండడంతో సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయని మూవీ టీం అలా ప్లాన్ చేశారు. కానీ తీరా చూస్తే ఫైటర్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మూవీ టీం సినిమాకి ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అంచనా వేసింది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో షాక్ త‌గిలింది.

ఈ సినిమాని సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. కానీ సినిమాకి ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. దాంతో ఫైటర్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకోవడం కష్టమే…ఒక వేళ సినిమా రిలీజై బాగుంద‌ని టాక్ వ‌స్తే రెండో రోజు నుండి క‌లెక్ష‌న్లు పెరిగే అవ‌కాశం ఉంది. మొద‌టి రోజు ఈ సినిమా ఎంత క‌లెక్ట్ చేస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Read More: అలియా, రణ్‌బీర్‌, విక్కీ కౌశల్ కాంబినేష‌న్‌లో భన్సాలీ ప్రేమ‌క‌థ‌

ట్రెండింగ్ వార్తలు