నా సపోర్ట్ ఎప్పుడు వారికే.. నా ఓటు ఉన్నది అక్కడే: నిహారిక

March 1, 2024

నా సపోర్ట్ ఎప్పుడు వారికే.. నా ఓటు ఉన్నది అక్కడే: నిహారిక

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమెకు రాజకీయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

నిహారిక బాబాయ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఈసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే నిహారికను యాంకర్ ప్రశ్నిస్తూ రాబోయే ఎన్నికలలో మీ మద్దతు ఎవరికి మీ ఓటు ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ..

నా మద్దతు ఎప్పుడు జనసేన పార్టీకే ఉంటుందని ఈమె తెలియజేశారు. తాను గత ఎన్నికలలో కూడా జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాను. ఇక ఈసారి ఎన్నికలలో కూడా తాను ప్రచార కార్యక్రమాలను తప్పకుండా నిర్వహిస్తానని తెలియజేశారు. ఇక నాకు ఓటు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక గతంలో వరుణ్ తేజ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడితే పలు విషయాలు తెలియజేశారు మేము ఎప్పుడు కూడా మా బాబాయ్ కి సపోర్ట్ చేస్తూనే ఉంటామని వారు ఆదేశించడమే ఆలస్యం మేము పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను చేయటానికి కూడా సిద్ధంగానే ఉన్నామని వరుణ్ తేజ్ తెలిపారు. రాజకీయాల పరంగా నాన్న పెదనాన్న బాబాయ్ ఏం చెబితే అదే మా నిర్ణయం అంటూ ఈ సందర్భంగా వరుణ్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి.

Read More: నిజాయతీగల పోలీసు అధికారి ప్రభాస్.. స్పిరిట్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు