August 24, 2022
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు చిత్రం మంచి ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రారంభించారు కమల్ అండ్ శంకర్. కానీ ఊహించని విధంగా లొకేషన్స్ పెద్ద ప్రమాదం జరిగి, అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోవడం, ఇటు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు, దర్శకుడు శంకర్‌కు బడ్జెట్ విషయంలో గొడవలు రావడం వంటి కారణాల చేత ఇండియన్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే కమల్‌హాసన్ రీసెంట్‌గా నటించిన విక్రమ్ సినిమా 300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ఇండియన్ 2ను కూడా సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని కమల్ డిసైడ్ అయ్యారు. అలా తిరిగి ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగస్టు 24, 2022న తిరిగి ప్రారంభమైంది. అయితే తమిళ నటుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాలో కొత్త భాగస్వామి అయ్యారు. లైకాతో కలిసి రెడ్ జెయింట్ మూవీస్ (ఉదయనిధి స్టాలిన్ ప్రొడక్షన్ హౌస్ పేరు) ఇండియన్ 2ను నిర్మిస్తుంది.
తాజాగా ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో తొలుత రకుల్, సిద్ధార్థ్‌లపై సీన్స్‌ను తీస్తారు. సెప్టెంబరులోనే కమల్‌హాసన్ సెట్స్‌లో జాయిన్ అవుతారు. ఈ లోపు స్పెషల్ మేకోవర్ కోసం కమల్ యూఎస్ వెళ్తారు. ఇక ఇండియన్ 2 సినిమాను వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కమల్‌హాసన్ విక్రమ్ ఈ ఏడాది జూన్‌లో విడుదలైన మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.