భారీ ధరకు గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్.. కైవసం చేసుకున్న ప్రముఖ సంస్థ!

March 20, 2024

భారీ ధరకు గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్.. కైవసం చేసుకున్న ప్రముఖ సంస్థ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శంకర్ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్ సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల కూడా వాయిదా పడుతుంది.

ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయం గురించి మేకర్స్ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. గేమ్ ఛేంజర్ మూవీ భారీ బడ్జెట్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నారు. ఇందులో హీరోయిన్ల పాత్రలలో అంజలి, కియారా అద్వానీ నటించబోతున్నారు.

ఇలా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అనే విషయం గురించి క్లారిటీ లేకపోయినా ఈ సినిమా డిజిటల్ రైట్స్ మాత్రం భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చేశారు.

భారీ ధరలకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు అమెజాన్ వారు ఇటీవల ముంబైలో నిర్వహించినటువంటి ప్రైమ్ వీడియో ఈవెంట్లో వెల్లడించారు. ఇకపోతే ఈనెల 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించినటువంటి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.

Read More: Premalu OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎక్కడ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు