జరగండి.. జరగండి అంటూ వచ్చేసిన రామ్ చరణ్ .. అదిరిపోయిన ఫస్ట్ సింగిల్!

March 27, 2024

జరగండి.. జరగండి అంటూ వచ్చేసిన రామ్ చరణ్ .. అదిరిపోయిన ఫస్ట్ సింగిల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ గా పనులను శర వేగంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. నిజానికి ఈ సినిమా నుంచి ఈ సాంగ్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు సందర్భంగా జరగండి జరగండి అని ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.

ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా కనిపించడమే కాకుండా శంకర్ విజువల్స్ ఎంతో చక్కగా ఉన్నాయి. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పాలి. ఇక ఈ సాంగ్ చూడటానికి ఎంతో కనువిందుగా వినసొంపుగా ఉంది. ఇలా ఈ సినిమా నుంచి అప్డేట్ రావడంతో చరణ్ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Read More: కారులో ఆ బోల్డ్ సీన్ చేయటం చాలా ఇబ్బందిగా.. అనుపమ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు