శంకర్ గేమ్ ఛేంజర్ లో మలయాళ స్టార్ హీరో.. ఎవరంటే?

March 18, 2024

శంకర్ గేమ్ ఛేంజర్ లో మలయాళ స్టార్ హీరో.. ఎవరంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించినటువంటి RRR సినిమా తర్వాత ఈయన శంకర్ డైరెక్షన్ లో  గేమ్ ఛేంజర్ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ షూటింగ్స్ సన్ని వేషాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో నటించబోతున్నారంటూ ఒక వార్త సంచలనంగా మారింది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్  లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పాత్రలో మలయాల నటుడు మోహన్ లాల్ కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

ఇలా ఈ హీరో ఈ సినిమాలో నటించబోతున్నారని ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గేమ్ ఛేంజర్ సినిమాలో ఈ పాత్ర నిడివి కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుందని తెలుస్తుంది. ఇక ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి అంటే మేకర్స్ అధికారికంగా తెలియజేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఇప్పటికే అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Read More: కార్తికేయ 3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలో రాబోతున్నాం అంటూ?

ట్రెండింగ్ వార్తలు