వరుణ్ భర్తగా రావడం అదృష్టం అంటున్న మెగా కోడలు?

February 3, 2024

వరుణ్ భర్తగా రావడం అదృష్టం అంటున్న మెగా కోడలు?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి లావణ్య త్రిపాఠి ఒకరు. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి లావణ్య త్రిపాఠి అనంతరం వరుస తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. అయితే ఈమె గత ఐదు సంవత్సరాలు కాలంగా మెగా హీరో వరుణ్ ప్రేమలో మునిగితేలుతున్నారు. రహస్యంగా వీరిద్దరూ ప్రేమలో కొనసాగుతూ గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య పూర్తిగా సినిమాలకు దూరమవుతుందని ఒకవేళ సినిమాలలో నటించిన ఈమెకు మెగా ఫ్యామిలీ చాలా కండిషన్స్ పెట్టింది అంటూ ఇదివరకు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి తాజాగా ఈ వార్తల గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సిరీస్ విడుదలైనటువంటి తరుణంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ పరంగా కూడా కొన్ని విషయాలను వెల్లడించారు. తాను పెళ్ళికి ముందు వరుణ్ తో ఎలా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని సినిమాల పరంగా ఏదైనా స్క్రిప్ట్ నాకు నచ్చితే తనకు చెప్పేదానినని తెలిపారు. నన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి రావడం నిజంగా నా అదృష్టం అని ఈమె తెలిపారు.

ఇక నువ్వు మెగా కోడలు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనే కండిషన్స్ నాకు ఏమాత్రం లేవని నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను అంటూ లావణ్య త్రిపాఠి వెల్లడించారు. ఇక కెరియర్ గురించి మాట్లాడుతూ నేను ఏదైనా ఒక సినిమాలో నటించాను అంటే ఆ పాత్ర నాకు గుర్తింపు తీసుకువచ్చేలాగా ఉంటేనే నటిస్తాను తప్ప సినిమాలు చేయాలి కదా అని వచ్చిన అవకాశాలన్నింటినీ చేయనని తెలిపారు. ప్రస్తుతం తాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నానని లావణ్య త్రిపాఠి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: హనుమంతుడు వచ్చే సీన్ అయోధ్య గుడి నుంచి చేయాల్సి ఉండేదా?

ట్రెండింగ్ వార్తలు