లావణ్య త్రిపాఠి నటన పై నాగబాబు షాకింగ్ కామెంట్స్?

February 14, 2024

లావణ్య త్రిపాఠి నటన పై నాగబాబు షాకింగ్ కామెంట్స్?

ఉత్తరాది అమ్మాయి అయినటువంటి నటి లావణ్య త్రిపాఠి ఇటీవల తెలుగింటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అందాల రాక్షసి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి లావణ్య త్రిపాటి మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ మెప్పించి హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డారు.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఇటీవల పెద్దల సమక్షంలో ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహం తర్వాత లావణ్య మెగా ఇంటి కోడలుగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి దూరమవుతారని ఈమె నటించాలి అంటే మెగా ఫ్యామిలీ కండిషన్స్ పెట్టారు అంటూ ఈమె నటన గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

ఇక లావణ్య త్రిపాఠి తన గురించి వస్తున్నటువంటి వార్తలు అన్నిటికి కూడా పులి స్టాప్ పెట్టారు. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి నటన గురించి తన మామయ్య నటుడు నాగబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఈ సిరీస్ గురించి నాగబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మై డియర్ లావణ్య.. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఎంతో అద్భుతంగా ఉంది. వినోదాత్మక అంశాలతో కట్టిపడేస్తోంది. ఇది అందరూ చూడాల్సిన వెబ్ సిరీస్ అంటూ ఈయన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ వెబ్ సిరీస్ పై తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇలా నాగబాబు తన నటనని పొగుడుతూ చేస్తున్నటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో ఓ సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

Read More: మరోసారి తల్లిదండ్రులైన గీత మాధురి నందు?

ట్రెండింగ్ వార్తలు