లావణ్య అడుగుపెట్టగానే మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్న నిహారిక?

February 12, 2024

లావణ్య అడుగుపెట్టగానే మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్న నిహారిక?

నిహారిక పరిచయం అవసరం లేని పేరు ఈమె మెగా డాటర్ కంటే కూడా తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి నిహారిక అనంతరం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే పెళ్లి బంధం ఎక్కువ కాలం పాటు నిలబడలేదని చెప్పాలి. నిహారిక పెళ్లయిన రెండు సంవత్సరాలకే తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం తన తండ్రి వద్ద ఉంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నిహారికకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది ఈమె త్వరలోనే మరో ఇంటికి మారబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఇలా నిహారిక వేరే ఇంటికి వెళ్లడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా అడుగుపెట్టిన తర్వాత నిహారిక వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నారు.

ఇలా ఈమె తన ఇంట్లోకి తన వదిన రావడంతో ఈమె ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో తన గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిహారిక లావణ్య మధ్య గొడవలు మొదలయ్యాయని అందుకే ఈమె ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో నిహారిక తాను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి గల కారణాలను తెలిపారు.

తాను లావణ్య త్రిపాఠితో గొడవలు పడి వెళ్లిపోవడం లేదని ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా కాస్త ఫ్రీడం ఉండాలని కోరుకుంటారు. అందుకే నేను కూడా నాకు నచ్చిన విధంగా ఉండటం కోసమే మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్నానని ఈమె తెలిపారు. మరికొద్ది రోజులలో తన ఇల్లు తయారవుతుందని ఇల్లు తయారు కాగానే నేను ఆ ఇంటికి మారబోతున్నానని నాకంటూ కొంత స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నాను కాబట్టే బయటకు వెళ్తున్నాను అంటూ నిహారిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Read More: కల్కి కోసం భారీగా డిమాండ్ చేసిన దీపిక.. మరో సినిమా తీయొచ్చు?

ట్రెండింగ్ వార్తలు