LEO Collections: లియో మూవీ కలెక్షన్స్ పై ప్రొడ్యూస‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..

October 27, 2023

LEO Collections: లియో మూవీ కలెక్షన్స్ పై ప్రొడ్యూస‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌..

తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ హీరోగా ‘విక్రమ్’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ‘లియో’. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19న రిలీజయింది ఈ సినిమా. రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడటంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ సినిమా. లియో 250 మరియు 300 బడ్జెట్‌తో తీశారు. అయితే మొదటిరోజు ఏకంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. వారం రోజుల్లో రూ.461 పైగా బాక్స్ఆఫీసు వద్ద వసూళ్లు రాబట్టంది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అని చిత్రయూనిట్ చెపుతున్నారు . 

లియో చిత్రం రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఈ సినిమా కలెక్షన్స్ పై రోజుకో పుకారు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజాగా తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ తిరుపూర్ సుబ్రహ్మణ్యం లియో సినిమా కలెక్షన్స్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన లియో కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా విషయంలో మేకర్స్ చెప్తున్న కలెక్షన్స్ అన్ని ఫేక్. ఇప్పటివరకు తమిళనాడులోని ఒక్క థియేటర్ కి కూడా లాభాలు రాలేదు. చిత్ర నిర్మాత లలిత్ కుమార్ కోట్లు ఖర్చుపెట్టి మరీ ఫేక్ ప్రమోషన్స్ చేయిస్తున్నారు. తప్పుడు కలెక్షన్స్ చూపిస్తూ సినిమాపై లేని హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read More: సిద్ధు ‘టిల్లు స్క్వేర్’తో ఫిబ్రవరి 9న తిరిగి రాబోతున్నాడు

ట్రెండింగ్ వార్తలు