January 9, 2022
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మహేశ్ సోదరుడు రమేశ్ బాబు శనివారం రాత్రి గుండెపోటు కారణంగా మృతి చెందారు. దీంతో సినీ పరిశ్రమ ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వార్త విని సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు మహా ప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే సోదరుడి అంత్యక్రియలకు మహేశ్ బాబు దూరమయ్యారు. ఇటీవలే మహేశ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో సోదరుడి మృతిపై భావోద్వేగానికి గురవుతూ అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు మహేశ్.
‘`నువ్వే నా స్ఫూర్తి.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నువ్వే నా సర్వస్వం..నువ్వు లేకుంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా కోసం నువ్వు చేసిన ప్రతి పనికి ధన్యవాదాలు. ఈ జన్మలోనే కాదు మరు జన్మలోనూ నువ్వే నా అన్నయ్యగా పుట్టాలని కోరుకుంటున్నాను..ఇక విశ్రాంతి తీసుకో…నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను“ అని ట్విట్టర్ ద్వారా స్పందించారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022