రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. ఆ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రధానం!

April 12, 2024

రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. ఆ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రధానం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలాంటివి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి చరణ్ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉంటూ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత ఈయన శంకర్ డైరెక్షన్లో చేస్తున్నారు.

ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తికానుంది ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. అలాగే ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అవుతున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రాంచరణ్ ఇప్పటికే ఎన్నో అరుదైన గౌరవాలను పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ నుంచి ఈయన గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు. చెన్నైకు చెందిన వేల్స్‌ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కళా రంగానికి చరణ్‌ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇదే యూనివర్సిటీ నుంచి ఏడాది జనవరి నెలలో పవన్ కళ్యాణ్ కి కూడా డాక్టరేట్ ప్రధానం చేయగా ఆయన ఎంతో సున్నితంగా ఈ డాక్టరేట్ తిరస్కరించారు. నాకంటే ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు వారికి ఈ డాక్టరేట్ ప్రధానం చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ తిరస్కరించగా అదే యూనివర్సిటీ నుంచి ఇప్పుడు రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రధానం చేయబోతున్నారనే విషయం తెలుసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  https://telugu.chitraseema.org/devara-stepped-into-the-set-of-war-2%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-2-%E0%B0%B8%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF-%E0%B0%85%E0%B0%A1%E0%B1%81%E0%B0%97%E0%B1%81/

 

ట్రెండింగ్ వార్తలు