మహేశ్‌బాబు, నాగార్జున మల్టీస్టారర్‌!

August 25, 2022

మహేశ్‌బాబు, నాగార్జున మల్టీస్టారర్‌!

అవును..మహేశ్‌బాబు, నాగార్జున కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ రూపొందే చాన్సెస్‌ ఉన్నాయి. తనతో మహేశ్‌ బాబు సినిమా చేయాలన్నట్లుగా నాగార్జునయే ప్రపోజల్‌ పెట్టారు. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్‌’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 25న హీరో మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘ది ఘోస్ట్‌’ సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేసినందుకు థ్యాంక్స్‌…మహేశ్‌. దాదాపు 29 సంవత్సరాల క్రితం మీ నాన్నగారు (కృష్ణ), నేను కలిసి ‘వారసుడు’ అనే సినిమాలో కలిసి నటించాము. ఈ సైకిల్‌ను మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు’’ అని ట్వీట్‌ చేశారు నాగార్జున. దీనిబట్టి మహేశ్‌బాబుతో నాగార్జున మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ చేసే ఆలోచలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

రీసెంట్‌గా నాగార్జున, అఖిల్‌ కాంబినేషన్‌లో మోహన్‌రాజా ఓ మల్టీస్టారర్‌ను ప్లాన్‌ చేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసందే. అయితే ఈ సినిమాను దృష్టిలో పెట్టుకునే నాగార్జున మహేశ్‌బాబును ఉద్దేశించి అలా ట్వీట్‌ చేశారా? అనే డౌట్స్‌ వస్తుంది సినిమా లవర్స్‌కు. మరి..నాగార్జున ప్రపోజల్‌కు మహేశ్‌ ఒప్పుకుంటారా? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు