ప్రభాస్ కల్కి కోసం 3 క్లైమాక్స్ సన్నివేశాలు?

February 5, 2024

ప్రభాస్ కల్కి కోసం 3 క్లైమాక్స్ సన్నివేశాలు?

సాధారణంగా ఒక సినిమా చేయాలి అంటే దర్శక నిర్మాతలు రచయితలు ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా ఒక భాగం మాత్రమే ఉంటే క్లైమాక్స్ అలాగే స్టార్టింగ్ సీన్లతో సినిమాకి ఎండింగ్ పాయింట్ ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఒక సినిమా రెండు భాగాలుగా వస్తుందంటేనే దర్శకులకు అసలు సిసలైన కష్టం ఏర్పడుతుంది.

ఒక సినిమా ఎప్పుడైనా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే తప్పనిసరిగా పార్ట్ వన్ మొత్తం సినిమా మంచిగా ఉండాలి అంతేకాకుండా మొదటి భాగం క్లైమాక్స్ రెండో భాగం కోసం ఎదురు చూసేలా ఉండాలి. అలా ఉన్నప్పుడే రెండో భాగంపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో ప్రభాస్ వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈయన బాహుబలి సినిమా చేసే సమయంలో మొదటి భాగం క్లైమాక్స్ కోసం రాజమౌళి ఎన్నో ఇబ్బందులు పడ్డారని పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇక ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమా విషయంలో కూడా అదే జరిగిందని క్లైమాక్స్ సన్నివేశం కోసం రెండు మూడు వెర్షన్ లు ప్రయత్నాలు చేశారని కూడా ప్రశాంత్ తెలిపారు. అయితే తాజాగా మరోసారి ప్రభాస్ సినిమాకి ఇలాంటి ఇబ్బంది తలెత్తింది. ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతున్నటువంటి తరుణంలో మొదటి భాగం క్లైమాక్స్ ఎలా ముగించాలన్న విషయంపై దర్శక నిర్మాతలు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎండింగ్ సీన్స్ చాలా హైలెట్ చేస్తూ రెండో భాగంపై అంచనాలు పెంచేలా ఉండేలాగే నాకు అశ్విన్ కథను సిద్ధం చేసుకున్నారట అయితే ఈ సినిమా క్లైమాక్స్ కోసం మూడు సన్నివేశాలను సిద్ధం చేశారని దీనిలో ఏదో ఒకటి ఫైనల్ చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.

Read More: బడా బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 90s డైరెక్టర్?

ట్రెండింగ్ వార్తలు