ఆ బాధితుల్లో నేనూ ఉన్నాను: చిరంజీవి

September 1, 2022

ఆ బాధితుల్లో నేనూ ఉన్నాను: చిరంజీవి

దర్శకులు కథలపై దృష్టి పెట్టాలని, నటీనటులు క్లాల్సీట్స్‌ విషయంలో రాజీ పడి కంగారు కంగారుగా సినిమాలు తీయవద్దని అంటున్నారు హీరో చిరంజీవి. శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బాషు హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’. ఈ చిత్రం సెప్టెంబరు 2న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఆగస్టు 31న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ – ఈ ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు నేను అతిథిగా రావడానికి ప్రధాన కారణం ఏడిద నాగేశ్వరరావుగారు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. మూడు సినిమాలు తీశాను. చిన్న చిన్న ఈవెంట్స్‌కు వెళ్తే మన స్థాయి తగ్గుతు ందని ఆలోచించే వ్యక్తిని కాదు నేను.నా వల్ల ఓ సినిమాకు సహాయం తోడైతే చాలా హ్యాపీ ఫీలవుతాను.

సినిమా పరిశ్రమ గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఆడియన్స్‌ థియేటర్స్‌కు రావడం లేదు అనుకుంటున్నారు. ప్రేక్షకు లు థియేటర్స్‌కు రాకపోవడం అనేది ఓ అపోహ మాత్రమే. సినిమాలో సరైన కంటెంట్‌ ఉంటనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారు. ఈ విషయాన్ని రీసెంట్‌గా విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ చిత్రా లు నిరూపించాయి. సినిమాలో కంటెంట్‌ లేకపోతే ఆ సినిమాలను ప్రేక్షకులు రిజెక్ట్‌ చేస్తున్నారు. ఈ బాధితుల్లో నేను ఒకణ్ణి. నా సినిమాను (పరోక్షంగా ‘ఆచార్య’ను ఉద్దేశిస్తూ…) రెండో రోజే రిజెక్ట్‌ చేశారు. ఓ దర్శకుడు సినిమాను సరిగ్గా తీయకపోతే చాలామంది జీవితాలు తల్లకిందులవుతాయి. భారీ తారాగణం, హిట్‌ కాంబినేషన్స్‌ దొరికాయని సరైన కంటెంట్‌ లేకుండా సినిమా తీయవద్దు. నటీనటులు, రిలీజ్‌ డేట్స్‌ క్లాష్‌ అవుతాయని కంగారు కంగారుగా సినిమా తీయవద్దు. దర్శకులు కథలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రతిభ ఉండి కష్టపడితే సినిమా ఇండస్ట్రీలో పైకొస్తారు. ఇండస్ట్రీని లైట్‌ తీసుకుంటే ఎంత వేగంగ పైకి వచ్చారో అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతారు. నేను ఈ సినిమా పరిశ్రమలోనే ఎక్కువగా ఉన్నాను. కొంతగ్యాప్‌ ఇచ్చిన మళ్లీ ఇక్కడికే వచ్చాను. నేను సిని పరిశ్రమలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సిని పరిశ్రమలోకికొత్తతరం రావాలి. ఆడబిడ్దలు అడుగుపెట్టాలి. తెలుగు పరిశ్రమలో ఆడవారికి ఎంతో గౌరవం ఉంది. అందరూ ఎంతో గౌరవిస్తారు

అలాగే తన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సినిమా విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు చిరంజీవి. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘ఎన్టీఆర్‌గారి ‘రాము’ సినిమాకు నేను, నాగబాబు వెళ్లాం. అప్పటికే అమ్మానాన్న సినిమా చూశారు. నాగబాబు టికెట్స్‌ కోసం చాలా కష్టపడ్డాడు. ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఆ రోజు నాన్న మమ్మల్లీ కొబ్బరిమట్టతో కొట్టారు’’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

ట్రెండింగ్ వార్తలు