శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం..ఎంతంటే..

November 26, 2021

శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ సాయం..ఎంతంటే..
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ లో చేరిన సంగ‌తి తెలిసిందే.. కరోనా కార‌ణంగా ఆయ‌న‌ గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. ఆయన భార్యకి,పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో వారు ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్‌ లో ఉంటున్నారు. ఈ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. ఇప్ప‌టికే సోనూసూద్‌, ధ‌నుష్ లాంటి వారు ముందుకు వ‌చ్చారు. అయితే తాజాగా ఈ విషయం తెలిసిన వెంటనే అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు చిరంజీవి. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు