నిద్ర కోసం ఆరాటపడిన రోజులు ఉన్నాయి.. మృణాల్ కామెంట్స్ వైరల్

March 19, 2024

నిద్ర కోసం ఆరాటపడిన రోజులు ఉన్నాయి.. మృణాల్ కామెంట్స్ వైరల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో సీరియల్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సీరియల్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నటువంటి ఈమెకు బాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చాయి ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూనే తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు.

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అవడంతో ఈమెకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెడుతున్నారు ఇందులో భాగంగా సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ ఠాకూర్ సినీ ఇండస్ట్రీలో బిజీగా కొనసాగే నటీనటులకు అప్పుడప్పుడు విరామం అవసరం అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎంతో వేగంగా పరిగెడుతున్నటువంటి ఈ సినీ ప్రయాణంలో నటి నటులు సరదాగా కొన్నిరోజులు కుటుంబంతో సమయం గడపటం, ప్రయాణాలు చేయటం, చేయటం ఎంతో ముఖ్యమని నేను అభిప్రాయ పడతాను. గత రెండు సంవత్సరాలుగా తీరికలేకుండా ప్రయాణం చేస్తున్నాను. మంచి నిద్ర కోసం ఆరాటపడిన రోజులు కూడా నా జీవితంలో ఎన్నో ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: నాకు పులిహోర కావాలంటూ టిల్లు స్క్వేర్ బోల్డ్ లుక్స్ పై కామెంట్స్ చేసిన అనుపమ!

ట్రెండింగ్ వార్తలు