వారిద్దరే నాకు స్ఫూర్తి.. మృణాల్ కామెంట్స్ వైరల్!

February 19, 2024

వారిద్దరే నాకు స్ఫూర్తి.. మృణాల్ కామెంట్స్ వైరల్!

వెండితెర నటిగా పలు హిందీ భాష చిత్రాలతో పాటు తెలుగు భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో వెండితెర సీతమ్మ మృణాల్ ఠాకూర్ ఒకరు . తెలుగులో సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈమె తెలుగు ప్రేక్షకుల మధ్యలో సీతగా నిలిచిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల హాయ్ నాన్న అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి అద్భుతమైనటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం మృణాల్ విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటి మృణాల్ ఠాకూర్ తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వృత్తి పరమైనటువంటి జీవితంలో నాకు రష్మిక దుల్కర్ సల్మాన్ ఇద్దరు చాలా స్ఫూర్తిగా నిలిచారు అంటూ ఈమె చెప్పుకోవచ్ఛారు.

తాను నటించిన సీతారామం సినిమాలో వీరిద్దరు కూడా నటించారు. వీరిద్దరి నుంచి నేను జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకున్నానని మృణాల్ తెలిపారు. రష్మిక పాత్రల ఎంపిక విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఈ సినిమాలో ఈమె ఆఫ్రిన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో నటించాలి అంటే చాలా ధైర్యం కావాలని తెలిపారు..

ఇక రష్మిక గంటల తరబడి పనిచేసిన తనలో అలసట అనేది ఏమాత్రం కనిపించదు అంటూ మృణాల్ తెలిపారు. ఇక నటుడు దుల్కర్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ.. ఈయన భాష ఏదైనా మంచి పాత్ర దొరికితే వెంటనే సినిమాలకు ఒప్పుకోవటం సినిమాల పట్ల తనకు ఉన్నటువంటి అంకితభావాన్ని తెలియజేస్తుంది. అందుకే వీరిద్దరిని చాలా స్ఫూర్తిగా తీసుకొని సినిమాల ఎంపిక విషయంలో తాను కూడా ముందుకు సాగుతున్నాను అంటూ ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: జనసేనలో కీలక పదవి అందుకున్న జానీ మాస్టర్.. గెలుపే లక్ష్యం అంటున్న మాస్టర్!

ట్రెండింగ్ వార్తలు